న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : అనిల్ అంబానీకి చెంది న రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఆర్కామ్పై) సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.3,750 కోట్లు మోసం చేసిన కేసులో ఆర్కామ్తోపాటు ఎల్ఐసీ మాజీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ అధికారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2012 లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జారీచేసిన రూ.1,500 కోట్ల విలువైన ఎన్సీడీలను ఎల్ఐసీ కొనుగోలు చేసిందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఎన్సీడీల కొనుగోలులో అక్రమాలు జరిగాయని గుర్తించిన సీబీఐ..దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నలుగురు నిందితులపై ఐపీసీ కింద నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం వంటి నేరాలతోపాటు, అవినీతి నిరోధక చట్టం-1988 పరిధిలోకి వచ్చే నేరాలకు సంబంధించి కూడా చార్జిషీట్ దాఖలు చేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.