అన్న వస్తున్నాడంటే సంబురం. చెల్లి అడుగు పెట్టిందంటే వేడుక. చేతినిండా రాఖీలు, నోటినిండా మిఠాయిలు, గుండెనిండా అనురాగాలు, దోసిళ్లనిండా కానుకలు.. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవర్ని కదిపినా ఇవే ఉద్వేగాలు.
‘రాఖీ పండుగ వచ్చేసింది. అర్జున్, అన్షులా, ఖుషీ ఇంకా కజిన్స్ అంతా కలుసుకోబోతున్నాం. అర్జున్ భయ్యాకు నేను మొదటిసారి రాఖీ కట్టిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ప్రతి రాఖీలో ఓ అంతర్లీన సందేశం ఉంటుంది. ఆ రూపంలో అన్న నుంచి చెల్లికి, తమ్ముడి నుంచి అక్కకు.. భద్రత, భరోసా అందుతాయి. తోబుట్టువులు గైడ్స్ లాంటివారు. అన్నను చెల్లి, అక్కను తమ్ముడు అనుసరించే ప్రయత్నం చేస్తారు. అమ్మానాన్నల కంటే, అన్నాదమ్ముళ్లతోనే అమ్మాయిలకు చనువు ఎక్కువ. కష్టమైనా సుఖమైనా వాళ్లతోనే పంచుకుంటాం. అర్జున్ లాంటి అన్న దొరకడం నా అదృష్టం’.
మా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. చెల్లి షిర్లి డాక్టర్‌గా విదేశాల్లో స్థిరపడింది. ఇప్పటి వరకూ మేం ఏ రాఖీ పండుగా మిస్ కాలేదు. తను విదేశాల్లో ఉన్నా.. ప్రతీ పండక్కి నాకు రాఖీ, కుంకుమ, చందనం పంపుతుంది. నేను కూడా బహుమతులతో సర్ప్రైజ్ చేస్తుంటాను. కొరియర్ ద్వారానే మా ఆనందాలు అటూ ఇటూ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ సారి నా అభ్యర్థన మేరకు స్వయంగా పర్యావరణ హితమైన రాఖీలు తయారుచేసి పంపింది. చెల్లి పంపిన రాఖీ అమ్మతో కట్టించుకోవడం ఇంకా ఇష్టం’.
‘కుటుంబంలోని చెల్లికో, అక్కకో పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఆడపిల్లకూ మనం అండగా ఉండాలనేది నా ఉద్దేశం. రాఖీ పండుగ నా దృష్టిలో చాలా ప్రత్యేకమైంది. దీని ద్వారా సోదరభావం మరింత పెరుగుతుంది. బయటివారు కూడా మన కుటుంబమే, మనవాళ్లే అనే భావన బలపడుతుంది. నాకు ఏటా 50 నుంచి 60 రాఖీలు వస్తుంటాయి. కొందరు స్వయంగా వచ్చి కడుతుంటారు. వారిలో చాలామంది ఎలాంటి ఆపద వచ్చినా నన్ను సంప్రదిస్తారు. నేను కూడా
చేతనైనంత సాయం చేస్తాను’.