PULASA FISH : ఆ చేప చాలా ఖరీదు. యానాం వద్ద గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు ఆ చేప చిక్కింది. అది అత్యంత అరుదైన పులుస చేపగా గుర్తించారు. ఆ పులస చేపను వేలం వేయగా రూ.22 వేల ధర పలికింది. ఈ చేప సుమారు రెండు కిలోల బరువు ఉందని తెలుస్తోంది.
యానాం ప్రాంతంలో చేపను పట్టిన మత్స్యకారులు దాన్ని అమ్మడానికి వేలం వేశారు. వేలంపాటలో ఆ చేపకు భారీ స్పందన లభించింది. చివరికి ఓ వ్యక్తి దాన్ని రూ.22 వేలకు దక్కించుకున్నాడు. పులస చేప అరుదైన రుచి కారణంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఇది వర్షాకాలంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి ప్రవేశిస్తుంది.
సంతానోత్పత్తి తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంది. సముద్రంలో ఉన్న సమయంలో దీన్ని విలస అని, గోదావరిలోకి ప్రవేశించినప్పుడు ‘పులస’ అని పిలుస్తారు.