తమిళ అగ్రహీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. పూజాహెగ్డే కథానాయిక. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా గురించి దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని ‘అరబిక్ కుతు..’ పాట విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. సోషల్‌మీడియాలో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ తెలిపింది. ఈ సందర్భంగా హీరో విజయ్ కొత్త స్టిల్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో విజయ్ అభిమానులకు ఈ సినిమా ఓ పండగలా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్నందించారు.