చిక్కడపల్లి, ఆగస్టు 22 : రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న అన్మైన్డ్ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీజీయూఈఈయూ)అధ్యక్షుడు కే ఈశ్వర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో 64మంది విధి నిర్వహణలో చనిపోయారని, వీరి కుటుంబసభ్యులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. గోవర్ధన్, స్వామి, ప్రభాకర్‌రెడ్డి, పూర్ణాచారి, రవి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉద్యోగులకు బ్లాక్ డే: స్థితప్రజ్ఞ
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్ అమలైన ఆగస్టు 23 ఉద్యోగులకు బ్లాక్‌డే అని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణకు నేడు బ్లాక్‌డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు.