డబుల్ డ్యూటీలకు సీఆఫ్లు రద్దు
టీజీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు ఇచ్చే డీఆఫ్, సీఆఫ్ సెలవులను తక్షణమే నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి కేవలం నగదు అలవెన్స్ (డీడీ ఆడ్వాన్స్) మాత్రమే చెల్లించాలని అన్ని రీజినల్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు పంపింది.
- నగదు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు ఇచ్చే డీఆఫ్, సీఆఫ్ సెలవులను తక్షణమే నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి కేవలం నగదు అలవెన్స్ (డీడీ ఆడ్వాన్స్) మాత్రమే చెల్లించాలని అన్ని రీజినల్ మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు పంపింది. సిబ్బంది కొరత ఉన్న డిపోల్లో బస్సు సర్వీసులు రద్దు కాకుండా ప్రయాణికుల సౌకర్యం కోసమే నగదు చెల్లింపు విధానాన్ని తెచ్చినట్టు పేర్కొన్నది. పలు డిపోల్లో నగదుకు బదులు అదనపు సెలవులు మంజూరు చేస్తున్నారని, దీనివల్ల డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రమై సర్వీసులు నిలిచిపోతున్నాయని అధికారులు గుర్తించారు.
సిబ్బందిలో ఆవేదన
యాజమాన్యం ఆదేశాలపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతున్నది. 16 నుంచి 18 గంటల పాటు నిరంతరం భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు, టికెట్లు జారీ చేసే కండక్టర్లకు శారీరక విశ్రాంతి అవసరమని, దాన్ని కొద్దిపాటి నగదుతో భర్తీ చేయలేమని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

