సౌదీపై హౌతీ దాడులు
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధ జ్వాలలు చల్లారకముందే సౌదీ అరేబియాహౌతీల మధ్య ఘర్షణ మళ్లీ తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. యెమెన్లో దశాబ్దకాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం, ప్రాంతీయ ఆధిపత్య పోరు, ఇరాన్సౌదీ పోటాపోటీ వైఖరి ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధ జ్వాలలు చల్లారకముందే సౌదీ అరేబియాహౌతీల మధ్య ఘర్షణ మళ్లీ తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. యెమెన్లో దశాబ్దకాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం, ప్రాంతీయ ఆధిపత్య పోరు, ఇరాన్సౌదీ పోటాపోటీ వైఖరి ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. కాల్పుల విరమణలు, దౌత్య చర్చలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో కొంతకాలం కనిపించిన ప్రశాంతత శాశ్వత శాంతికి దారితీయకపోవడం ఈ ప్రాంతంలోని అస్థిరతకు అద్దం పడుతున్నది. ఒకవైపు ఇజ్రాయెల్పాలస్తీనా సంక్షోభం, మరోవైపు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల ముప్పు, ఇంకోవైపు గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యం కోసం పోటీ.. ఈ పరిణామాల మధ్య సౌదీహౌతీ ఉద్రిక్తతలు పెరగడం ఏమాత్రం వాంఛనీయం కాదు. ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరా, ఆహార భద్రత, అంతర్జాతీయ దౌత్యసంబంధాల మీదా ఈ ఘర్షణ తీవ్ర ప్రభావం చూపే ప్రమాదమున్నది.
2022లో యెమెన్ ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన సంధితో సౌదీ అరేబియా, హౌతీల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు కొంతకాలం తగ్గుముఖం పట్టినప్పటికీ, యెమెన్ అంతర్యుద్ధానికి శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ ఏడాది జూలైలోనే క్షిపణి దాడులు మళ్లీ మొదలయ్యాయి. అక్టోబర్లో పరిస్థితి మరింత విషమించింది. సౌదీ రాజధాని రియాద్ విమానాశ్రయంపై దాడులు, చమురు, మౌలిక సదుపాయాలపై క్షిపణుల ప్రయోగం, సౌదీ ప్రతిదాడులతో ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. ఈ నెల 13న ధహ్రాన్లోని సౌదీ అరామ్కో ప్రధాన కార్యాలయంపై హౌతీలు దాడి చేశారు. సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని హౌతీలు హెచ్చరించడం గమనార్హం. ఈ ఘర్షణల వెనుక ప్రాంతీయ శక్తుల ప్రయోజనాలు, ఇరాన్సౌదీ విభేదాలు, అమెరికా పాత్ర, ఎర్ర సముద్రంపై నియంత్రణ వంటి అనేక అంశాలు ఉన్నాయి. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉండగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా నిలబడుతున్నది.
ప్రపంచ ఇంధన మార్కెట్లలో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాలు, ఎగుమతి టెర్మినళ్లు, విమానాశ్రయాలపై దాడులు కొనసాగితే ఉత్పత్తి, రవాణా, సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగి, ఆర్థిక రంగంపై ఒత్తిడి తేవడం కనిపిస్తున్నది. ఇక్కడ మరో కీలక భౌగోళిక అంశం బాబ్ ఎల్ మందెబ్ జలసంధిలో హౌతీలు జరుపుతున్న దాడులు. సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల నుంచి చమురు, ఇతర సరుకుల రవాణాలో జలసంధికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నది. ఈ మార్గంలో నౌకలపై దాడులు పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాల్సి వస్తున్నది. దీనివల్ల పెరిగే అదనపు భారం అంతిమంగా వినియోగదారులపైనే పడుతుంది. భారీ ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశానికి ఇది చిన్న సమస్య కాదు. ఈ ఘర్షణల నిలిపివేతకు, యెమెన్లో శాశ్వత శాంతికి ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఐక్యరాజ్యసమితితో పాటు, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి చురుకైన పాత్ర పోషించాలి. ప్రపంచం మరో విస్తృత యుద్ధాన్ని భరించే స్థితిలో లేదు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

