హరీశ్‌కు షోకాజ్ నోటీసు పచ్చి అబద్ధం.. ఫేక్ నోటీసు కాంగ్రెస్ పార్టీ సృష్టే
‘మాజీ మంత్రి హరీశ్‌రావుకు నేను షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఫేక్. చిల్లర రాజకీయాలను నమ్ముకున్న ఆ పార్టీ నా పేరిట ఫేక్ నోటీసును సృ ష్టించి దాని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నది.
- బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి సోమా భరత్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెత్తపనులపై ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకనే ఇలా దిగజారి వ్యవహరిస్తున్నది..’ అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, లీగల్‌సెల్ ప్రతినిధి సోమా భరత్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను హరీశ్‌రావుకు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలెవరూ ఇ లాంటి విషప్రచారాన్ని నమ్మబోరని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ నాయకులు ఇంతటి నీచానికి ఒడిగట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం
ఫేక్ షోకాజ్ నోటీసుపై సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేస్తానని భరత్‌కుమార్ తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని కోరారు. కారకులెవరో తేల్చి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇలాంటి వ్యవహారాలకు తావులేదని పునరుద్ఘాటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

