TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
TGSRTC | పండుగల వేళ ఆర్టీసీ బస్సు టికెట్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. 2003 నాటి జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే టికెట్ ధరల నిర్ణయాలు తీసుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది.
TGSRTC | పండుగల వేళ ఆర్టీసీ బస్సు టికెట్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. 2003 నాటి జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే టికెట్ ధరల నిర్ణయాలు తీసుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది. అయితే, అదే జీవో అమల్లో ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టికెట్ ఛార్జీలు ఎందుకు పెంచలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఎందుకు పెరుగుతున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ టికెట్ ధరలను పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. సాధారణ బస్సులను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. పండుగల సమయంలో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల నిర్వహణపై హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం.. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయాలు 2003 నాటి జీవో ప్రకారం నిబంధనలకు అనుగుణంగానే తీసుకుంటున్నామని తెలిపింది. ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ జీవో ఆధారంగా ఛార్జీలను ఎలా నిర్ణయిస్తున్నారు? సాధారణ రోజులతో పోలిస్తే పండుగ సమయంలో ఎంత అదనంగా వసూలు చేస్తున్నారు? అనే వివరాలను ప్రకటనలో వెల్లడించలేదు. దీంతో సంస్థ ఇచ్చిన వివరణపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎందుకీ పెంపు?
2003లోనే జీవో ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అదే నిబంధనలు అమల్లో ఉన్నాయని, అప్పుడు పండుగల పేరుతో ఇదే స్థాయిలో ఛార్జీలు ఎందుకు పెంచలేదని జనాలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్టీసీ టికెట్ ధరల పెంపు ఎందుకు తరచూ చర్చకు వస్తోందని నిలదీస్తున్నారు.
7 వేల అదనపు బస్సులు నడిపామన్న ఆర్టీసీ
దసరా సందర్భంగా బస్సు సర్వీసులను తగ్గించలేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 7 వేల అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి కేటాయించిన అదనపు బస్సుల్లో 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని వెల్లడించింది. అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని సంస్థ తెలిపింది. మహిళా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

