Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Army Officer's Wife Shared Info | ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్య, చైనాతో సహా విదేశీ నిఘా ఏజెంట్ల ఉచ్చులోపడ్డారు. విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించిన గూఢచార సంస్థలకు చెందిన ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారి భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనగర్: ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్య, చైనాతో సహా విదేశీ నిఘా ఏజెంట్ల ఉచ్చులోపడ్డారు. విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించిన గూఢచార సంస్థలకు చెందిన ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారి భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Army Officer’s Wife Shared Info) తెలంగాణకు చెందిన ఒక మహిళ, జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక సీనియర్ ఆర్మీ అధికారి భార్య. అయితే కొంతమంది చైనా, విదేశీ గూఢచారులు విద్యావేత్తల ముసుగులో ఆమెను సంప్రదించారు. ప్రచురణ కోసం వ్యూహాత్మక, దేశ రక్షణకు ప్రాముఖ్యత ఉన్న అంశాలపై వ్యాసాలు, కథనాలు ఆమెతో రాయించారు.
కాగా, చైనాతో సహా విదేశీ గూఢచార సంస్థలకు చెందిన ఆ ఏజెంట్లు మొదట ఆర్మీ అధికారి భార్యతో పర్యావరణం, భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ఆర్టికల్స్ రాయించారు. ఆ తర్వాత మెల్లగా రక్షణ రంగానికి సంబంధించిన అంశాల వైపు ఆమెను మళ్లించారు. అయితే విద్యావేత్తల ముసుగులో తనను సంప్రదించిన వారు వాస్తవానికి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న గూఢచారులని ఆమె గ్రహించలేకపోయారు. దీంతో ఆమెకు తెలియకుండానే దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశారు.
మరోవైపు దేశీయ నిఘా సంస్థలు ఈ విషయాన్ని పసిగట్టాయి. దేశ భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే సున్నితమైన పత్రాలు, ఫొటోలు, ఎలక్ట్రానిక్ డేటాను రహస్యంగా సేకరించడం, చైనా, ఇతర విదేశీ గూఢచార సంస్థల ఏజెంట్లకు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మార్గాల ద్వారా వాటిని ఆమె అందించినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లో అధికార రహస్యాల చట్టంతోపాటు బీఎస్ఎస్లోని సెక్షన్ల కింద ఆర్మీ అధికారి భార్యపై కేసు నమోదు చేశారు. విదేశీ గూఢచారులతో ఆమెకు ఎలా పరిచయం ఏర్పడింది, వారికి ఎలాంటి సమాచారం చేరవేశారు అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

