BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ కెనడా విభాగం ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ కెనడా చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల పేరు మీద పత్రికా ప్రకటన విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పైన, ఆయన హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపైన నిత్యం విమర్శలు చేస్తున్నారని తన ప్రకటనలో ఆరోపించింది.
BRS Canada : కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ కెనడా విభాగం ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ కెనడా చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల పేరు మీద పత్రికా ప్రకటన విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పైన, ఆయన హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపైన నిత్యం విమర్శలు చేస్తున్నారని తన ప్రకటనలో ఆరోపించింది.
తీవ్రమైన ప్రజా సమస్యలను సంచలనాత్మక రాజకీయ కథనాలుగా ఎలా మార్చేస్తున్నారనడానికి కొండ పోచమ్మ ప్రాజెక్టును కేసీఆర్ ఫామ్‌హౌస్‌తో ముడిపెడుతూ తాజాగా వెలుగు పత్రిక ప్రచురించిన కథనమే ఉదాహరణ అని బీఆర్ఎస్ కెనడా విభాగం పేర్కొన్నది. ఆ పత్రిక వద్ద విశ్వసనీయమైన ఆధారాలు ఉంటే.. అధికారిక సాగునీటి రికార్డులు, ఆమోదిత కెనాల్ అలైన్మెంట్లు, ఇంజనీరింగ్ పత్రాలు, ఇతర ధృవీకరించదగిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేసింది.
వెలుగు కథనానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి..? మరి మీడియా ప్రస్తుత ప్రభుత్వాన్ని అదే స్థాయిలో కఠినమైన ప్రశ్నలు ఎందుకు అడగడం లేదు..? అని బీఆర్ఎస్ కెనడా విభాగం తమ ప్రకటనలో ప్రశ్నించింది. తెలంగాణ ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే సమస్యలపై వారికి సమాధానాలు కావాలని పేర్కొన్నది. తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం నెరవేర్చిందని నిలదీసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించింది.
ఎల్‌నినో, తీవ్ర వాతావరణ పరిస్థితులవల్ల కలిగే సవాళ్లకు తెలంగాణను సిద్ధం చేయడానికి ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ కెనడా విభాగం క్వశ్చన్ చేసింది. కరువులు, అధిక వర్షపాతం, వ్యవసాయ నష్టాలు, నీటి భద్రత నిర్వహణకు ప్రభుత్వ సమగ్ర ప్రణాళిక ఏమిటని అడిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయకుండా పదేపదే గత ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నదని ప్రశ్నించింది.
మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, కానీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రక్రియలో భాగం కాకూడదని బీఆర్ఎస్ కెనడా విభాగం హితవు పలికింది. తాము పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని, అధికారంలో ఉన్నవారిని మీడియా ప్రశ్నించాలని సూచించింది. కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణల ఆధారంగా సంచలన కథనాలు ప్రచురించడంలో చూపుతున్న ఉత్సాహాన్ని ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ఎందుకు చూపడంలేదని ప్రశ్నించింది.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిజమైన ఆందోళనలు ఉంటే వాటిపై క్షుణ్ణంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ కెనడా విభాగం సూచన చేసింది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించకుండా గత ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా జర్నలిజాన్ని రాజకీయ దూషణ సాధనంగా మారుస్తున్నారని విమర్శించింది. ప్రజలు వారి ఉపాధి గురించి, నీటిపారుదల గురించి, నీటి భద్రత గురించి, రైతుల సంక్షేమం గురించి, పెట్టుబడులు ఆర్థికవృద్ధి గురించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

