Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణమని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పలుగు తండాకు చెందిన ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీ బాయి దంపతుల కుమార్తెలు వాడిత్య నివేదిత, వాడిత్య అఖిల ఇద్దరూ ఎంబీబీఎస్ సీట్లు సాధించి కుటుంబసమేతంగా వచ్చి తనను కలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు.
Harish Rao : రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణమని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పలుగు తండాకు చెందిన ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీ బాయి దంపతుల కుమార్తెలు వాడిత్య నివేదిత, వాడిత్య అఖిల ఇద్దరూ ఎంబీబీఎస్ సీట్లు సాధించి కుటుంబసమేతంగా వచ్చి తనను కలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు.
ఒకప్పుడు మెడిసిన్ చదవడమంటే కోట్ల రూపాయల ఫీజులు, డొనేషన్లు కట్టగలిగే సంపన్నులకే సాధ్యమనే భావన ఉండేదని, కానీ పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే బలమైన సంకల్పంతో కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించారని హరీష్రావు తెలిపారు. దానికితోడు జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 10,000 పైచిలుకు పెంచడం నేడు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోందన్నారు.
గురుకులాల్లో ఉచితంగా చదువుకుని ఎంబీబీఎస్ సీటు సాధించడం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని చెప్పారు. నాడు తెలంగాణ పోరాటంలో పిడికిలెత్తిన ఉద్యమకారుల బిడ్డలు.. నేడు కేసీఆర్ విద్యా సంస్కరణల ఫలితంగా స్టెతస్కోప్ పట్టుకొని సమాజ సేవకు సిద్ధమవుతుండటం గర్వకారణమన్నారు. బడుగు, బలహీన వర్గాల, గిరిజన తండాల పిల్లల జీవితాలను కేసీఆర్ విద్యా, సంక్షేమ విధానాలు ఎలా మారుస్తున్నాయో చెప్పడానికి నివేదిత, అఖిలల విజయం ఒక గొప్ప నిదర్శనం అని చెప్పారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన నివేదితకు, అఖిలకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత వైద్యులుగా ఎదిగి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

