Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma Celebrations | కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కౌలాలంపూర్ : కౌలాలంపూర్లో మలేషియా (Malaysia ) తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వేడుకలకు మణియిల్ ఫస్ట్ సెక్రటరీ భారత హైకమిషన్ రాజేష్ హెచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ జానపద నృత్య కళాకారిణి జనుల్యూరి, ప్రముఖ జానపద గేయ రచయిత , గాయకుడు దిలీప్ దేవ్గన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరి పాల్గొన్నారు. మలేషియాలోని వివిధ ఇండియన్ అసోసియేషన్ల అధ్యక్షులు, ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరై తెలంగాణ సంస్కృతిని ఆస్వాదించారు.
వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ తెలంగాణ వంటకాలు మరియు ఆహార సంస్కృతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సందర్శకులు తెలంగాణ రుచులను ఆస్వాదించేలా ప్రత్యేక ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సైదం తిరుపతి , ఉపాధ్యక్షులు చిరుత చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి దండెబోయిన, ప్రధాన కార్యదర్శి: సందీప్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ రావు నడిపెల్లి, కోశాధికారి సందీప్ కుమార్ లగిశెట్టి, సంయుక్త కోశాధికారి సుందర్ రెడ్డి మోర్తాల, యూత్ అధ్యక్షులు సంతోష్ దాసరాజు, ఉపాధ్యక్షులు పోలాది శివ తేజ, అడ్వైజరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

