హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ)కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ వీఆర్ఏ, వీఆర్వోలు లేకపోవడం వల్ల లగచర్ల వంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తంచశారు. టీజీఆర్ఎస్ఏ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాణాల రాంరెడ్డిని అభినందించారు. రెవెన్యూ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ సంఘం ప్రాతినిథ్యం వహిస్తుందని చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా బిక్షం, కోశాధికారిగా మల్లేశ్, మహిళా విభాగం అధక్షురాలిగా సుజాత హాన్ ఎన్నికయ్యారు.