హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంట్ టెస్ట్‌లు ఈ నెల 25 నుంచి నిర్వహింస్తున్నట్టు టీజీపీఎస్సీ అడిషనల్ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం పేర్కొన్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. 19 నుంచి హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. హెల్ప్‌డెస్క్ 040-22445566 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎస్సెస్సీబోర్డు పొడిగించింది. 28 వరకు అవకాశం ఇచ్చింది. ఆలస్య రుసుము లేకుండా 28 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు ఆయా తేదీల్లోపు పాఠశాల హెచ్ఎంలకు పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు.