అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా
కంట్రోల్ రూమ్‌లు, మరమ్మతు బృందాలు సిద్ధం.. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి.
హనుమకొండ, అక్టోబర్ 26 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 27 నుంచి 29వ వరకు భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఎస్ఈలకు సూచించారు. సోమవారం హనుమకొండ నకలగుట్టలోని ప్రధాన కార్యాలయం నుంచి ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ సరిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సరిల్, డివిజన్, సబ్ డివిజన్ స్థాయిల్లో 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, విద్యుత్తు సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం బ్రేక్‌డౌన్ గ్యాంగ్లతోపాటు ఏజెన్సీ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ఈఆర్టీ వాహనాలను అవసరమైన ప్రాంతాల్లో మోహరించాలని తెలిపారు. విద్యుత్తు లైన్ల ఇంటర్ లింకింగ్ సదుపాయాలను వినియోగించుకుంటూ, లైన్ లేదా ఫీడర్ దెబ్బతిన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

