రామగిరి, జూన్ 11 : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-2026’ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు టీజీ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ సీనియర్ ప్రొఫెసర్ అల్వాల రవి గురువారం తెలిపారు.
హైదరాబాద్లోని మాసబ్ ట్యాంకులో గల తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఎంజీయూ వీసీ, టీజీ ఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ కాజా అల్తా హుస్సేన్ హాజరవుతున్నట్టు తెలిపారు.