Assembly Budget Session | ఈ నెల 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 23వ తేదీన శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సారి 10 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.