హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఫలితంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా జిల్లాలను అధికారులు బ్లాక్ చేశారు. సోమవారం వరకు కేవలం జగిత్యాల, కరీంనగర్, జనగామ, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయించే అవకాశముండటంతో, వాటినే పరీక్షా కేంద్రాల జాబితాలో ఉంచారు. అభ్యర్థులు ఏ జిల్లా వారైనా ఈ 6 జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు. టెట్ దరఖాస్తుల సమర్పణ గడువు మంగళవారంతో ముగియనున్న ది. సోమవారం వరకు మొత్తం 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్ట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు.