పదకొండో పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 25-43తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. పాలమూరు రైడర్ గల్లా రాజు 9 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. అతడికి ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించలేదు.
- రాత మారని టైటాన్స్
- ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న తెలుగు టైటాన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 25-43తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. పాలమూరు రైడర్ గల్లా రాజు 9 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. అతడికి ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించలేదు. మొత్తం 14 రైడ్లు చేసిన రాజు… ఏడు టచ్ పాయింట్లు సాధించడంతో పాటు.. ట్యాక్లింగ్‌లోనూ ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను ఉడుం పట్టుపట్టాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ (3), ఆదర్శ్ (4), ఆకాశ్ (2), అరుణ్ (0) విఫలమయ్యారు. తలైవాస్ తరఫున అజింక్యా పవార్ (10), సాగర్ (9), మన్జీత్ (9) రాణించారు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది 11వ పరాజయం కాగా.. ఒకే ఒక్క మ్యాచ్ నెగ్గిన తెలుగు జట్టు 22 పాయింట్లతో పట్టిక అట్టడుగున కొనసాగుతున్నది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36-30 తేడాతో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

