హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక తెలంగాణ స్కాష్ ఓపెన్-2025 పోటీలు ఘనంగా ముగిశాయి. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా వారం రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి వచ్చిన స్కాష్ క్రీడాకారులు.. తమ ప్రతిభను ప్రదర్శించారు.
పలు విభాగాల్లో జరిగిన ఈ పోటీలలో ప్లేయర్లు చూపిన క్రీడాస్ఫూర్తి ఈ టోర్నీకే హైలైట్గా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. అభిమానులు, కుటుంబసభ్యుల మద్దతులో చివరిరోజు పోటీలు ఉత్సాహంతో సాగాయి.