హనుమకొండ చౌరస్తా, జూలై 12 : మహారాష్ట్రలోని పూణెలో శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఐదవ ఇండియా తైక్వాండ్ ఓపెన్ పారా జాతీయ చాంపియన్‌షిప్ (క్యోరుగి అండ్ పూమ్సే) లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు సత్తాచాటింది. ఈనెల 10, 11వ తేదీల్లో ముగిసిన టోర్నీలో తెలంగాణ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
రాష్ట్ర జట్టు మొత్తం 9 పతకాలు సాధించగా ఇందులో 4 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలున్నాయి. హనుమకొండ ఆరెపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్, కే లోకేశ్వరి, కే శివ, జీ రాజేశ్ పసిడి పతకాలు సాధించారు. నరసింహ, డీ సాయిబాబా రజతాలు నెగ్గగా.. అబ్దుల్, రమేశ్, సకుబాయి కాంస్య పతకాలు గెలిచారు