Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించిన స్లీపర్సెల్స్పై నిరంతరం నిఘా పెట్టాలని ఇంటెలిజెన్స్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.
అలాగే హైదరాబాద్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ నెల 25, 26 తేదీల్లో హెచ్ఐసీసీ కేంద్రంగా ‘భారత్ సమ్మిట్-2025’, మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్-2025 పోటీలు జరగనున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.