మండల పరిషత్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
మండల పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం డిమాండ్
ఖైరతాబాద్, నవంబర్ 11: మండల పరిషత్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు గడీల కుమార్‌గౌడ్, కార్యనిర్వాహణ అధ్యక్షుడు దేవీరవీందర్ మాట్లాడుతూ.. సకాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సుమారు రూ.5,600 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ నిధులను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల నేతగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థలపై సవతితల్లి ప్రేమ చూపుతూ వాటిని భ్రష్టుపట్టించిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పదవీకాలం ముగియగానే ఎన్నికలు నిర్వహించారని, తెలంగాణలో ఎన్నికలు నిర్వహించకుండా దాటవేయడం ఏందని ప్రశ్నించారు. రిజర్వేషన్లను సాకుగా చూపి మొత్తం స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా భారీ కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవం కల్పించింది గత కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అతి తక్కువ ఉన్న సర్పంచ్ల వేతనాన్ని రూ.ఐదు వేలకు పెంచి ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవప్రదమైన వేతనాలు కల్పించడంతోపాటు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు మన్నె రాజు ముదిరాజ్, ప్రణయ్చందర్, అరిగే అశోక్‌కుమార్, సాయన్న, దెబ్బట భాస్కర్, కిరణ్, పాండు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

