ట్రక్‌పార్క్ అమ్మితే ఊరుకోం
భవిష్యత్‌లో పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలకు భూములు లేకుండా అమ్ముకోవడం సిగ్గుచేటని, గత పాలకులు అమ్మకుండా కాపాడితే... నేడు విలువైన స్థలాన్ని కాంగ్రెస్ కాజేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరంకృష్ణారావు అన్నారు.
-
ప్రజా అవసరాలకు భూములు ఉండొద్దా?: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 11..భవిష్యత్‌లో పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలకు భూములు లేకుండా అమ్ముకోవడం సిగ్గుచేటని, గత పాలకులు అమ్మకుండా కాపాడితే… నేడు విలువైన స్థలాన్ని కాంగ్రెస్ కాజేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరంకృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్‌పల్లిలోని ట్రక్‌పార్క్ స్థలాన్ని విక్రయించకుండా ఆపాలని కోరుతూ.. కూకట్పల్లి, మూసాపేట పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్‌లో ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడేందుకు కేవలం ట్రక్‌పార్కు స్థలం మాత్రమే అందుబాటులో ఉందన్నారు.
జనాభాకు అనుగుణంగా పార్కులు, క్రీడాప్రాంగణాలు, వాటర్ ట్యాంక్‌లు లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వసతులు కల్పించడానికి ఉపయోగపడే ఏకైక స్థలం ట్రక్‌పార్కు స్థలమని, దీనిని కూడా ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం బాధాకరమన్నారు. ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకుని ఢిల్లీకి పంపే ప్రయత్నం జరుగుతున్నదని ఎమ్మెల్యే విమర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

