Home
Telangana
Police Serve Notice To Brs Leader Basu Shyamala For Supporting Farmers Irrigation Protest
బీఆర్ఎస్ నాయకురాలికి నోటీసులు
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, బీఆర్ఎస్ నాయకురాలు బాసు శ్యామలకు పోలీసులు నోటీసులు అందజేశారు.
- సాగునీటి కోసం ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చినందుకు కేసు
గద్వాల, నవంబర్ 11 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, బీఆర్ఎస్ నాయకురాలు బాసు శ్యామలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మిచేడ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకొన్న శ్యామల అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బుధవారం గద్వాల జిల్లాకేంద్రంలోని ఆమె ఇంటికి చేరుకొన్న పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. కడుపు మండి సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపితే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతుల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

