ఒక ఎమ్మెల్సీ, 5 కార్పొరేషన్ పదవులు ఇవ్వండి
తమకు రాబోయే ఎమ్మెల్సీల ఖాళీల్లో ఒక ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఐదు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఇవ్వాలని తెలంగాణ జన సమితి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది.
- సీఎంతో తెలంగాణ జనసమితి నేతల భేటీ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తమకు రాబోయే ఎమ్మెల్సీల ఖాళీల్లో ఒక ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఐదు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఇవ్వాలని తెలంగాణ జన సమితి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరింది. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు అయ్యిందని, ఇప్పటివరకూ తమకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం మాత్రమే ఇచ్చారని, మరో ఎమ్మెల్సీ స్థానం, అయిదు కార్పొరేషన్లకు చైర్మన్ల పోస్టులను ఇవ్వాల్సి ఉన్నదని కోదండరాం గుర్తుచేశారు.
దీనికి సీఎం స్పందిస్తూ.. ఇప్పుడైతే రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రయత్నించాలని, త్వరలో జరిగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో జన సమితికి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అయిదు కార్పొరేషన్లకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా త్వరలో చేపడుతామని, అప్పుడు కచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బృందం కూడా సీఎంను కలిసింది. వారు కూడా తమకు ఎన్నికల ముందు ఇస్తామన్న హామీ మేరకు కార్పొరేషన్ పోస్టుల భర్తీలో అవకాశం ఇవ్వాలని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

