సీఎంను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొంది.
- మద్రాస్ హైకోర్టు స్పష్టం
చెన్నై: ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొంది. హింసను ప్రేరేపించడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే ఆధారాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. డీఎంకే కౌన్సిలర్ సుధపై తమిళనాడు సీఎం విజయ్ను కించపరిచారనే ఆరోపణలతో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, జస్టిస్ ఎస్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశంసించడంతోపాటు విమర్శించే హక్కు కూడా పౌరులకు ఉందని తెలిపారు. పాలకులు విమర్శలకు అతీతులు కారని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అధికార పార్టీ ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇస్తే పోలీసులపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

