కలల్లో వేధించిన హతుడు..లొంగిపోయిన నిందితుడు
ఒక గొడవ విషయంలో ఆప్త మిత్రుడిని హత్య చేసిన వ్యక్తి.. పీడకలల ధాటికి తట్టుకోలేక పోలీసులకు లొంగిపోయిన ఘటన మహారాష్ట్రలోని మోతగావ్లో గత నెల 9న జరిగింది. విశాల్ కదమ్, ప్రభు కర్కడే ఆప్త మిత్రులు.
థాణె: ఒక గొడవ విషయంలో ఆప్త మిత్రుడిని హత్య చేసిన వ్యక్తి.. పీడకలల ధాటికి తట్టుకోలేక పోలీసులకు లొంగిపోయిన ఘటన మహారాష్ట్రలోని మోతగావ్లో గత నెల 9న జరిగింది. విశాల్ కదమ్, ప్రభు కర్కడే ఆప్త మిత్రులు. ఒక రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య చిన్న వాదన జరిగింది. ప్రభు కోపంతో విశాల్‌పై పిడి గుద్దులు కురిపించి, కాళ్లతో తన్ని చంపేశాడు.
ఈ హత్యపై ఆందోళన చెందిన నిందితుడు తన యజమాని సందేశ్‌కు విషయాన్ని తెలిపి అతడి సాయంతో ఒక వాగు వద్ద విశాల్ శవాన్ని పూడ్చి పెట్టాడు. అయితే ఆ తర్వాత 20 రోజుల పాటు మృతుడు పీడ కలల్లో వేధించడంతో ప్రభు నిద్రలేని రాత్రులు గడిపాడు. పశ్చాత్తాపంతో కుంగిపోయిన అతడు థాణె పోలీసుల ఎదుట తన నేరాన్ని ఒప్పుకొన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభు, సందేశ్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

