ఎస్బీఐ లాభం 23 వేల కోట్లు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.23,038 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది.
- క్యూ2లో 14 శాతం పెరిగిన ప్రాఫిట్
న్యూఢిల్లీ, నవంబర్ 3 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.23,038 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.20,160 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షాకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,34,979 కోట్ల నుంచి రూ.1,43,796 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ అశ్విని కుమార్ తివారీ మాట్లాడుతూ..పలు ఇండస్ట్రీలకు రూ.7.8 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాల్సివున్నదన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రభావితమైన రంగాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కింద బ్యాంక్ రూ.28 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఇందులో దేశీయ విమానయాన సంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.39 శాతానికి తగ్గాయి. కిందటేడాది ఇది 1.73 శాతంగా ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 0.42 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయి.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ నిధుల కేటాయింపులు రూ.4,132 కోట్ల నుంచి రూ.2,759 కోట్లకు తగ్గాయి.
- సమీకృత విషయానికి వస్తే రూ.1,87,756 కోట్ల ఆదాయంపై రూ.25,361 కోట్ల లాభాన్ని గడించింది.
మ్యూచువల్ ఫండ్ సంస్థతోపాటు ఎన్ఎస్ఈలో వాటా విక్రయించడంతో సమకూరిన నిధుల వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. బ్యాంక్ దేశీయ నికర వడ్డీమార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన 0.11 శాతం పెరిగి 3.11 శాతానికి చేరుకోవడం శుభసూచికం. భవిష్యత్తులో కూడా 3 శాతం కంటే ఎగువనే కొనసాగుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణం, డిపాజిట్లలో వృద్ధి 14-15 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. ఎల్ నినో నేపథ్యంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఆస్తుల నాణ్యతపై ఎటువంటి ప్రభావం పడలేదని, రాబోయే రోజుల్లో గ్రామీణ వినియోగంపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

