హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(లచ్చిరెడ్డి), తపస్.. సీపీఎస్ఈయూ.. పీఆర్టీయూ టీఎస్.. పాలిటెక్నిక్ జేఏసీ.. ఇలా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వరుసగా ఉద్యమ బాట పడుతున్నాయి. సమరశంఖాన్ని పూరిస్తున్నా యి. తాజాగా ఉద్యమ బాట పడుతున్న సం ఘాల జాబితాలో మరో జేఏసీ చేరింది. తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ సర్కార్‌పై జంగ్కు సిద్ధమైంది. ఇంటర్ విద్యను పాఠశాల విద్య లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఈ జేఏసీ ఆందోళన బాటపట్టనున్నది.
ఈ నెల 4న జేఏసీ కీలక భేటీని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ ఉద్యోగుల సంఘం, జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రిన్సిపాళ్ల సం ఘం, గెజిటెడ్ లెక్చరర్ల సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించామని.. అందరిని కలుపుకుని ఉద్యమించనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకెళతామని పేర్కొన్నారు. ఒక రోజు విద్యార్థి సంఘాలతో సదస్సు, మరో రోజు రాజకీయ పార్టీలు, సంఘాలతో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. విలీన నిర్ణయాన్ని సర్కార్ ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
సీఎం పరిశీలనలో ఫైల్..
ఇంటర్‌విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడానికి సంబంధించిన ఫైల్ సీఎం పరిశీలనలో ఉంది. విలీనంలో భాగంగా ఇంటర్ విద్య అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించారు. దీనిపై న్యాయసలహాలు కూడా తీసుకున్నారు. అనంతరం ఈ ఫైల్ సీఎం రేవంత్ వద్దకు చేరింది. అయితే రెండు చట్ట సవరణలు చేయాల్సి ఉంది. అంటే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది.
నిర్ణయం జరిగిపోయింది
ఇంటర్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న నిర్ణయం జరిగిపోయిందని ప్రభుత్వ సలహాదారు, విద్యా విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ డాక్టర్ కే కేశవరావు(కేకే) ఇటీవలే జేఏసీ నేతలకు చెప్పారు. ఇదే అంశంపై కొంతకాలం క్రితం అధ్యాపక, ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపారు. జూనియర్ లెక్చరర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. మెజారిటీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించా రు. దీనిపై స్పందించిన కేకే విలీన నిర్ణయం జరిగిపోయింది. విలీనం చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు మాత్రమే ప్రస్తావించాలని సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం. ఉద్యోగుల సర్వీసు, సీనియారిటీకి ఎలాంటి రక్షణ కావాలని ఆరా తీసినట్టు తెలిసింది. విలీనం చేయొద్దని స ర్కార్‌కు సిఫార్సు చేయాలని జేఏసీ నేతలు కోరినట్టు సమాచారం. అవసరమైతే పాఠశాల విద్యకు బదులు ఉన్నత విద్యలో వి లీనం చేయాలని చెప్పినట్టు సమాచారం.