కారుణ్య నియామకానికి వివాహిత అర్హురాలే!
విధి నిర్వహణలో తండ్రి మృతి చెందడంతో కుటుంబానికి ఆసరాగా నిలువడానికి కారుణ్య నియామకం కోసం 11 ఏండ్లుగా పోరాటం చేస్తున్న ఓ మహిళకు హైకోర్టులో న్యాయం దకింది. తండ్రి స్థానంలో వివాహితకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. కారుణ్య నియామకం కింద పిటిషనర్ జ్యోతికి వేతన ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేసిన రామకృష్ణారెడ్డి 2014 లో మృతిచెందారు.
- హైకోర్టు తీర్పు
హైదరాబాద్, అక్టోబర్ 28, (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో తండ్రి మృతి చెందడంతో కుటుంబానికి ఆసరాగా నిలువడానికి కారుణ్య నియామకం కోసం 11 ఏండ్లుగా పోరాటం చేస్తున్న ఓ మహిళకు హైకోర్టులో న్యాయం దకింది. తండ్రి స్థానంలో వివాహితకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. కారుణ్య నియామకం కింద పిటిషనర్ జ్యోతికి వేతన ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేసిన రామకృష్ణారెడ్డి 2014 లో మృతిచెందారు.
ఆయన స్థానంలో కారు ణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలం టూ కుమార్తె జ్యోతి 2014లో ఎస్పీడీసీఎల్కు వినతిపత్రం అందజేశారు. తన వినతిని విద్యుత్తుసంస్థ తిరసరించడాన్ని సవాల్ చేస్తూ జ్యోతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కుటుంబసభ్యులందరి అంగీకారంతో పిటిషనర్ కారుణ్య నియామకం కోసం 2014లో దరఖాస్తు చేశారని తెలిపారు. ఆమెతోపాటు తల్లి దరఖాస్తు చేసినా కుమార్తె వివాహిత అన్న కారణంతో తిరసరించారని చెప్పారు. టీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తండ్రి చనిపోయి 11 ఏండ్లయినా జీవనం వెళ్లదీస్తున్నారని, ఆమె భర్తపై ఆధారపడి ఉన్నారని అందువల్ల తండ్రిపై ఆధారపడలేదని అర్థం చేసుకోవాలని అన్నారు. కారుణ్య నియామకం హకు కాదని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి కుమార్తెను, కుమారుడిని వేరు చేసే ఎలాంటి వర్గీకరణ అయినా రాజ్యాంగ విరుద్ధమేనని, విడాకులు పొందిన, భర్త వదిలివేసిన మహిళకు మాత్రమే అర్హతను పరిమితం చేసే వర్గీకరణ చట్టం ముందు నిలువదని సయారా ఖాతూన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేరొన్నారు. పిటిషనర్‌కు పెళ్లి అయిందని, నిబంధనలు అంగీకరించవనే తప్ప నియామకాన్ని నిరాకరించడానికి మరెలాంటి కారణాలను చెప్పడం లేదని అన్నారు. ఆమెను కారుణ్య నియామకం కింద పరిగణనలోకి తీసుకొని అన్ని ప్రయోజనాలతో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

