కావేరీ సీడ్స్ రూ.5 డివిడెండ్
ప్రముఖ విత్తన సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.8.8 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15.3 కోట్ల నష్టంతో పోలిస్తే తగ్గింది.
హైదరాబాద్, అక్టోబర్ 28 : ప్రముఖ విత్తన సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.8.8 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15.3 కోట్ల నష్టంతో పోలిస్తే తగ్గింది. ఆదాయం రూ.220 కోట్ల నుంచి రూ.244 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరునకు రూ.5 లేదా 250 శాతం మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. అలాగే ఎనిమిది దేశాల్లో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటిలో తాంజానియా, కెన్యా, వియత్నం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జాంబియా, పేరు ఉన్నాయి. ఇందుకోసం రూ.4 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

