స్పెషల్ ఆఫీసర్‌గా.. సర్ఫరాజ్ అహ్మద్
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- జయేశ్ రంజన్ స్థానంలో అదనపు బాధ్యతలు
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న జయేశ్ రంజన్‌ను ఆటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించగా, ఈ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు.
అయితే ఇప్పటికే సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా, మెట్రో రైల్ ఎండీ వంటి కీలక శాఖల బాధ్యతల్లో ఉండడం, తాజాగా జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ అదనపు బాధ్యతల మోతతో ట్రై కార్పొరేషన్లు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయా? లేక ఎనిమిది నెలలుగా సాగుతున్న ప్రతిష్ఠంభన అలాగే కొనసాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- స్టాండింగ్ కమిటీ సమావేశాలకే పరిమితం
ఇన్నాళ్లూ స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన జయేశ్ రంజన్ స్టాండింగ్ కమిటీ సమావేశాలకే పరిమితమైయారన్న ప్రచారం ఉంది. మూడు కార్పొరేషన్లతో నగర రూపురేఖలు మారుస్తారని ఆశించిన పాలకులు, అధికారుల తీరు కేవలం స్టాండింగ్ కమిటీ సమీక్షలకే పరిమితం కావడం.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు పట్టాలెక్కలేదు.
పైగా గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో ఒకంటే ఒక కొత్త ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి పనులు అడుగు ముందుకు పడక, ఫైళ్లు టేబుళ్ల మీద నత్తనడకన సాగుతుండటంతో నగర పౌరులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే హెచ్ఎండీఏలో మెగా ప్రాజెక్టులు, మరోవైపు విస్తరిస్తున్న మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుల ఒత్తిడిలో ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, ఇప్పుడు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మలాజిగిరి పరిధిలోని కార్పొరేషన్ వ్యవహారాలను ఎంతవరకు సమర్థవంతంగా సమన్వయం చేయగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కేవలం అధికారులను మార్చడం ద్వారానే మార్పు వచ్చేస్తుందా? లేక ఈ అదనపు బాధ్యతల నిధుల కొరత, పాలనా స్తబద్ధతను కప్పిపుచ్చేందుకేనా? అనేది త్వరలోనే తేలనున్నది. సవాళ్లతో కూడుకున్న ఈ క్లిష్ట సమయంలో..నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఆయన చురుగ్గా కదలిక తెచ్చి ఈ కార్పొరేషన్లను ప్రగతి పథంలోకి నడిపిస్తారో లేదో వేచి చూడాల్సిందే!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

