కంఫర్ట్‌జోన్ దాటితే విజయం!
మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మితశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ చిత్రం ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మితశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ చిత్రం ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ‘ఓ మైగాడ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ గీతాన్ని భాస్కరభట్ల రచించగా, రామ్ మిరియాల ఆలపించారు.
సింజిత్ ఎర్రమిల్లి స్వరకర్త. ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ మాట్లాడుతూ ‘నా కంఫర్ట్‌జోన్ దాటి బయటకు వచ్చాను. అప్పుడే విజయాలు సాధ్యమని నమ్ముతున్నా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అన్నారు. కథానుగుణంగా అద్భుతమైన పాటలు కుదిరాయని దర్శకుడు పేర్కొన్నారు. అలీ, రజిత, రఘుబాబు, ప్రియా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: శ్రీను కంబాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

