ఒలింపియాడ్‌కు అర్జున్
- ప్రతిష్ఠాత్మక టోర్నీకి తెలంగాణ గ్రాండ్ మాస్టర్’
చెన్నై: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌కు తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో జోరు మీదున్న వరంగల్ కుర్రాడు మెగాటోర్నీలో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. చెన్నై వేదికగా జూలై 28 నుంచి జరుగనున్న 44వ ఒలింపియాడ్‌కు అఖిల భారత చెస్ ఫెడరేషన్ సమాఖ్య (ఏఐసీఎఫ్) భారత జట్లను సోమవారం ప్రకటించింది. ఓపెన్, మహిళల విభాగంలో 20 మంది ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
ఈ బృందాలకు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా వేదికగా జరుగాల్సిన ఈ మెగాటోర్నీ భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. 14 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 150 దేశాల నుంచి ప్లేయర్లు పాల్గొంటారని ఏఐసీఎఫ్ భావిస్తున్నది. ఒలింపియాడ్‌లో భారత్ 2014లో కాంస్యం, 2020లో స్వర్ణం, 2021లో కాంస్యం సాధించింది. గతానికన్నా ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే ఉద్దేశంతో భారత చెస్ సమాఖ్య ప్రతిభ గల యువ ప్లేయర్లతోపాటు సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్లను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతున్న భారత సీనియర్ ప్లేయర్లతో పాటు యువ జీఎమ్‌లు మెగాటోర్నీలో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
జట్లు
ఓపెన్: ఇండియా-ఏ: విదిత్ గుజరాతి, హరికృష్ణ, అర్జున్ ఇరిగేసి, నారాయణన్, శశికిరణ్.
ఇండియా-బీ: నిహాల్ సరిన్, గుకేశ్, అదిబన్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వని.
మహిళలు: ఇండియా- ఏ: కోనేరు హంపి, హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి.
ఇండియా -బీ: వాంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, మేరి అన్గోమ్స్, పద్మినీ రౌత్, దివ్య దేశ్‌ముఖ్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

