Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
Hyderabad | రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భూముల వేలానికి సిద్దమైంది. హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను విక్రయించి సుమారు రూ.600 కోట్ల ఆదాయం సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
Hyderabad | రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భూముల వేలానికి సిద్దమైంది. హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను విక్రయించి సుమారు రూ.600 కోట్ల ఆదాయం సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే గత నెలలో ప్రారంభించిన రూ.1,500 కోట్ల భూముల వేలం ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా మరిన్ని భూముల విక్రయానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం.
కోకాపేట, ముసాపేట, బంజారాహిల్స్‌లోని హుడా ప్లాట్లు, బాచుపల్లి, ఇన్ముల్ నర్వా తదితర ప్రాంతాల్లో భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది. వీటితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన స్థలాలను కూడా వేలం ద్వారా విక్రయించనున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 41/41లో 0.21 ఎకరాలు, 1.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాలు, మొకిలాలో 300 నుంచి 500 గజాల విస్తీర్ణంలో మొత్తం 61 ప్లాట్లు, షాబాద్300 గజాల విస్తీర్ణంలో 35 ప్లాట్లు, తుర్కయాంజాల్ 600 నుంచి 1,146 గజాల విస్తీర్ణంలో 11 ప్లాట్లు, అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో 1,452 గజాల స్థలం విక్రయించనున్నారు.
భూముల వేలానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో కనీస ధరలను కూడా నిర్ణయించారు. ఖానామెట్‌లో ఎకరానికి రూ.99 కోట్ల ధరను నిర్ధారించగా.. మొకిలాలో గజానికి రూ.55 వేలు, తుర్కయాంజాల్‌లో రూ.50 వేలు, షాబాద్‌లో రూ.25 వేల చొప్పున కనీస ధర నిర్ణయించినట్లు సమాచారం. వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారి కోసం శనివారం నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 14 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ వేలం నిర్వహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

