ఒక్కో బావి పూడికతీతకు 12 వేలు.. సాగుపై చేతులెత్తేసిన సర్కార్
అష్టకష్టాల మధ్య వానకాలం నుంచి బయటపడిన రైతులు.. ఆశ వదలక యాసంగికి సిద్ధమవుతున్నారు. సాగునీరు, కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిన రైతన్న మరోసారి సాగుకు సన్నద్ధమవుతున్నాడు.
- యాసంగిపై ఆశ చావని రైతన్న
- సర్కార్‌పై అన్నదాత మండిపాటు
పెద్దపల్లి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : అష్టకష్టాల మధ్య వానకాలం నుంచి బయటపడిన రైతులు.. ఆశ వదలక యాసంగికి సిద్ధమవుతున్నారు. సాగునీరు, కరెంట్ సరఫరాపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిన రైతన్న మరోసారి సాగుకు సన్నద్ధమవుతున్నాడు. వరి వేయొద్దని, ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం చెప్తుండటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ పంటలు వేయాల న్నా సాగునీరు తప్పని కావడంతో సొంత నీటి వనరులను అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వానకాలం సాగుతో రైతులు ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. అయినప్పటికీ మళ్లీ అప్పు చేసి వ్యవసాయ బావులకు మరమ్మతులు చేయిస్తున్నా రు.
ఒకో బావికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు పెడుతూ పూడికతీత పనులు చేయిస్తున్నారు. మరోవైపు వరి వద్దంటున్న సర్కార్.. ఇతర పంటలు ఏమి వేయాలో చెప్పకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, దుకి ఖర్చులకు తోడు బావుల పూడికతీత కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. సాగుపై ఆశతో తాము ముందడుగు వేస్తుం టే.. కనీసం భరోసా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీరు, ఉచిత విద్యుత్తు అందుబాటులో ఉండటంతో ఏ ఇబ్బందీ లేకుండే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు.
తాతల నాటి బావే ఆధారమైంది
నాకు రెండెకరాలు ఉన్నది. ఈ యాసంగి లో పంటలకు నీళ్లు రావని తేలిపోయింది. ఉన్న ఒక్క ఆధారమ ల్లా మా తాతల కాలం నాడు తవ్వించిన బావే. అందుకే ఈ బావిపై ఆశతోనే తవ్విస్తున్న. గంటకు రూ. 4 వేలు అవుతున్నయి. దాదాపు రూ. 12 వేల వరకూ ఖర్చు అయ్యింది.
– నూనె రాంచంద్రం, రైతు (పెద్దపల్లి)
సొంత బావిపైనే నా ఆశ
మేం ఎవుసమే ఆ ధారంగా బతుకుతం. పంటలు వేయొద్దంటే ఎట్ల? జీవనాధారం ఇదేనాయే. సొంతంగా నాలుగు ఎకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. నా సొంత బావిపైనే ఆశతో పూడిక తీయించి సాగుకు సిద్ధమవుతున్న.
– ఆకుల తిరుపతి, దొంగతుర్తి, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

