మళ్లీ అంధకారంలోకి తెలంగాణ!
2026-27లో గరిష్ఠ డిమాండ్ 19,953 మెగావాట్లుగా ఉండగా, అందుబాటులో ఉండే సామర్థ్యం 17,013 మెగావాట్లు మాత్రమే. దీంతో 2,940 మెగావాట్ల లోటు ఏర్పడింది. 2027- 28లో గరిష్ఠ డిమాండ్ 21,240 మెగావాట్లకు, 2029 -30లో 23,761 మెగావాట్లకు చేరనున్నది.
- డిమాండ్‌కు తగినంతగా లేని విద్యుత్తు సరఫరా
- రానున్న పదేండ్లలో భారీగా పెరుగనున్న డిమాండ్
- అందుకు తగినట్టు ప్రణాళిక సిద్ధంచేయని ప్రభుత్వం
2026-27లో గరిష్ఠ డిమాండ్ 19,953 మెగావాట్లుగా ఉండగా, అందుబాటులో ఉండే సామర్థ్యం 17,013 మెగావాట్లు మాత్రమే. దీంతో 2,940 మెగావాట్ల లోటు ఏర్పడింది. 2027- 28లో గరిష్ఠ డిమాండ్ 21,240 మెగావాట్లకు, 2029 -30లో 23,761 మెగావాట్లకు చేరనున్నది. 2030-31 నాటికి 24,882 మెగావాట్లు, 2032-33లో 26,955 మెగావాట్లు, 2035-36 నాటికి 29,812 మెగావాట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2035-36 నాటికి గరిష్ఠ డిమాండ్ 29,812 మెగావాట్లకు చేరుతుండగా, అందుబాటులో ఉండే సామర్థ్యం 16,778 మెగావాట్లకు తగ్గనుంది. అంటే 13,034 మెగావాట్ల లోటు ఏర్పడనున్నది. రాష్ట్ర వార్షిక విద్యుత్తు వినియోగం 2026-27లో 1,08,125 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) ఉండగా, 2035-36 నాటికి 1,77,219 ఎంయూలకు పెరుగనున్నది.
2026- 27లో వార్షిక విద్యుత్తు అవసరం 1,08,125 ఎంయూలుగా ఉండగా, ఇకనుంచి లోటు మరింతగా పెరుగనున్నది. 2027-28లో 2,371 ఎంయూల లోటు, 2029-30లో 14,446 ఎంయూల లోటు ఏర్పడే అవకాశమున్నది. 2035-36 నాటికి ఈ లోటు 61,630 ఎంయూలకు చేరి ప్రమాద ఘంటికలు మోగించనున్నది.
(కొంటు మల్లేశం) హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో చీకట్లతో ఉసూరుమన్న రోజులను రేవంత్ సర్కార్ మళ్లీ తీసుకొస్తున్నది. అసమర్థ నాయకుడి ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి కూరుకుపోతున్నది. విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీరు.. ‘దూప అయినప్పుడే.. బాయి తవ్వుకున్న’ చందంగా తయారయ్యింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దగ్గరపడుతున్నా.. ఇన్నాళ్లూ కొత్త ప్లాంట్లు కట్టడంపై ఊసెత్తని ప్రభుత్వం.. కరెంటు కటకట తీవ్రమయ్యేదాకా మీనమేషాలు లెక్కించి ఇప్పటికిప్పుడు కొత్త ప్లాంట్లు కడతామంటూ హడావుడి చేస్తున్నది.
ఇందులో భాగంగానే పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపిం ది. మూడు వేల మెగావాట్ల సోలార్, నాలుగు వేల మెగావాట్ల బ్యాటరీ, 800 మెగావాట్ల పవర్ ప్లాంట్లు కట్టేందుకు నిర్ణయం తీసుకొన్నది. అయితే, ఈ ప్లాంట్ల నిర్మాణం జరిగి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. అలాగే, రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు తగినవిధంగా ప్రస్తుతం కరెంటు సరఫరా లేనట్టు నిపుణులు చెప్తున్నారు. దీనికి కారణం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తీరిపోతున్న పాత ఒప్పందాల గడువు
మరోవైపు, గతంలో కుదుర్చుకున్న పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ) గడువు కూడా సమీపిస్తున్నట్టు నిపుణులు గుర్తుచేస్తున్నారు. కేటీపీఎస్ స్టేజ్-5కు చెందిన 500 మెగావాట్ల ఒప్పందం 2029-30లో, కేటీపీపీ యూనిట్-1కు చెందిన మరో 500 మెగావాట్ల ఒప్పందం 2035-36లో ముగియనున్నది. పారిశ్రామిక వ్యర్థాలు, సౌర, బయోగ్యాస్ తదితర వనరులకు చెందిన సుమారు 187 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ఒప్పందాల కాల పరిమితి కూడా త్వరలో ముగియనున్నది.
మొత్తంగా 1,187 మెగావాట్ల ఒప్పందాల గడు వు ముగియనున్నది. దీంతో గడువు పూర్తయితే అదనపు విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇక, కొత్తగూడెం(పాల్వంచ)లో కొత్త థర్మల్ ప్లాంట్ కట్టా ల్సి ఉండగా, దీనిని సర్కార్ విస్మరించింది. రామగుండంలో 800మెగావాట్ల థర్మల్ ప్లాంట్ కు డీపీఆర్ రెడీ అయినప్పటికీ, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా ఎన్టీపీసీ, జెన్కోల మధ్య ఊగిసలాడుతున్నది. నారాయణపేట జిల్లా మక్తల్‌లోనూ కొత్త ప్లాంటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇంతవరకూ అతీగతీ లేదు.
కొత్తవి వస్తున్నా.. ఇంకా లోటే
రాష్ట్రంలో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మాణం లో ఉన్నాయని సర్కార్ పెద్దలు చెప్తున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్‌కు సరిపడాలేక విద్యుత్తు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-2 నుంచి 800మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రా నున్నది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం-కుసుమ్ ) పథకం కింద 1,802.5మెగావాట్ల సౌర విద్యు త్తు కొనుగోలుకు ఒప్పందాలు కుదిరాయి. దీం ట్లో కేవలం 176.7 మెగావాట్ల ప్లాంట్లు మాత్ర మే ప్రారంభమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో 1,500 మెగావాట్ల అవర్ బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యానికి సంబంధించిన బిడ్డింగ్‌ను టీజీ జెన్కో పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకున్నా.. రానున్న సంవత్సరాల్లో ఏర్ప డే అవసరాలు, గరిష్ఠ డిమాండ్‌కు సరిపడా వి ద్యుత్తు అందే అవకాశాలు కనిపించడంలేదు. అయినప్పటికీ, ప్రభుత్వం ముందస్తు ఉపశమన చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తున్నది. ప్రభు త్వ పెద్దలు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడకుంటే, తెలంగాణ చీకటిమయమయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

