క్యూట్‌గా.. బబ్లీగా.. కాస్తంత చలాకీగా..
‘నా మూలాలు కర్నాటక అయినా.. పుట్టిపెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్నప్పట్నుంచీ శ్రీదేవిగారంటే ఇష్టం.
‘నా మూలాలు కర్నాటక అయినా.. పుట్టిపెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్నప్పట్నుంచీ శ్రీదేవిగారంటే ఇష్టం. ఆమెను చూసే నటన, నాట్యం నేర్చుకున్నా. ఫారిన్లో చదువుతూ కూడా థియేటర్ని వదల్లేదు. ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్‌తో నా కెరీర్ మొదలైంది. లీడ్ హీరోయిన్గా నా తొలి సినిమా ‘దొంగ నా కొడుకు’. తొలిసారి బిగ్ స్క్రీన్‌పై నన్నునేను చూసుకోబోతున్నందుకు ఎక్సయిటెడ్గా ఉంది’ అని కథానాయిక సుష్మితా శెట్టి అన్నారు. మౌళి తనూజ్ ప్రశాంత్‌కి జోడీగా ఆమె నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’. శ్రీను కంబాల దర్శకుడు.
ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ నెల 13న విడుదల కానున్నది ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సుష్మితా శెట్టి మాట్లాడారు. ‘ఇందులో క్యూట్‌గా బబ్లీగా కాస్తంత చలాకీగా కనిపిస్తా. తనకు తాను చాలా స్మార్ట్ అనుకునే పాత్ర అనమాట. హీరోని పిచ్చిగా ప్రేమిస్తుంది. ఓ క్రైమ్‌లో తెలియకుండానే అమాయకంగా ఇరుక్కుంటుంది. ప్రేక్షకులు నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపింది సుష్మితాశెట్టి. మైత్రీ మూవీమేకర్స్‌లో పనిచేయడం ఆనందంగా ఉందని, హీరో మౌళీతో వర్క్ చేయడం చాలామంది అనుభవమని, టైటిల్ మాదిరిగానే సినిమా కూడా హ్యూమరస్‌గా, హాయిగా నవ్వుకునేలా ఉంటుందని సుష్మితా శెట్టి చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

