‘కింగ్ 100’లో మహంతి ఝాన్సీరాణిగా
అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘కింగ్ 100’ పేరుతో రానున్న ఈచిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై రా కార్తీక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాలో టబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇందులో ఆమె పోషిస్తున్న మహంతి ఝాన్సీరాణి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక గ్లింప్స్‌ని విడుదల చేశారు.
టబు పవర్ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ‘ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.. లక్‌ను నమ్మేవాళ్లు ఒకరు.. హార్డ్ వర్క్‌ని నమ్మేవాళ్లు మరొకరు. ఐ షేట్ లక్’ అనే డైలాగ్‌తో ఆమె పాత్ర పోకడను ఈ గ్లింప్స్ ఆవిష్కరించింది. భారీ జనసమూహం ముందు టబు ఎంట్రీ ఇవ్వడం, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రమాణస్వీకారం చేయడం.. ఈ సన్నివేశాలతో గ్లింప్స్ క్యూరియాసిటీని పెంచింది. చీరకట్టులో ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ గ్లింప్స్‌లో టబు కనిపించారు. అత్యంత పవర్ఫుల్ కథ, కథనాలతో రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
CM Meeting | అచ్చంపేట సీఎం సభలో మహిళల నిర్బంధం..కూలిన గేట్లు, ఫ్లెక్సీలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

