ప్రజల కష్టాల్ని తీర్చిన ఉద్యమకారుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తెలంగాణదేవుడు’. మ్యాక్లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ వడత్యా దర్శకత్వం వహిస్తున్నారు. జిషాన్ ఉస్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొన్న పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకుడిగా శ్రీకాంత్ పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జిషాన్ ఉస్మాన్ క్యారెక్టర్ శక్తివంతంగా సాగుతుంది. తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడిలా నటించాడు. తెలుగు చిత్రసీమలోని 50 మంది అగ్రనటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది’ అని తెలిపారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్‌కుమార్, మూలకథ, నిర్మాత: మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్, రచన, దర్శకత్వం: వడత్యా హరీష్.