హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చాప్టర్ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఆదివారం నగరంలోని అరణ్యభవన్‌లో జరిగిన ఐఎఫ్ఎస్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ చాప్టర్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ చంద్రపర్గేయన్, ఉపాధ్యక్షుడిగా ఎలుసింగ్ మేరు, కార్యదర్శిగా వినయ్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ప్రభాకర్, కోశాధికారిగా శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయిలో అటవీ అధికారుల సర్వీస్, పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్యవర్గం తెలిపింది.