Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
Bureaucrats | రాష్ట్రంలో పాలనా యంత్రాంగం మునుపెన్నడూ చూడనంత తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయిందని, ప్రజాభవనం నుంచి సచివాలయం దాకా అప్రకటిత పెన్‌డౌన్ కొనసాగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Bureaucrats | ‘ఈ ప్రభుత్వం పనైపోయింది. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. రేపు ఎలాగూ బీఆర్ఎస్ వస్తది. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అరాచకానికి దిగుతున్నట్ట్టే.. ఇప్పటి తప్పుడు నిర్ణయాలపై రేపు వచ్చే ప్రభుత్వం విచారణలు చేపడితే మా పరిస్థితేంది?’.. రాష్ట్రంలోని బ్యూరోక్రాట్లలో తీవ్ర మానసిక సంఘర్షణ మొదలైంది. అందువల్లే ముఖ్యనేత, బిగ్‌బ్రదర్ ఒత్తిడి చేసినా, పలు ఫైళ్లపై, నిర్ణాయక పత్రాలపై సంతకాలు పెట్టేందుకు జంకుతున్నారు. చెప్పిందల్లా తాము చేయలేమని తెగేసి చెప్తున్నారు. ముఖ్యనేత, బిగ్‌బ్రదర్స్ వ్యవహారశైలికి తోడు షాడో సీఎంవో పెత్తనం వారిలో మరింత ఆందోళన కలిగిస్తున్నది. జీహుజూర్ అనలేక, ఫైళ్లపై సంతకాలు చేయలేక డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాష్ట్రం వీడేందుకు సిద్ధమవుతున్నారు. సర్వీసు ఇంకా ఉండగానే స్వచ్ఛంద విరమణకూ సిద్ధపడుతున్నారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాలనా యంత్రాంగం మునుపెన్నడూ చూడనంత తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయిందని, ప్రజాభవనం నుంచి సచివాలయం దాకా అప్రకటిత పెన్‌డౌన్ కొనసాగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాజకీయ నాయకులు చెప్పినట్టు ఫైళ్లపై సంతకాలు చేస్తే రేపు విచారణలు ఎదురోవాల్సి వ స్తుందనే భయం.. చేయకపోతే పాలకుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళనతో ఇ బ్బందులు పడుతున్నట్టు తెలిసింది. అటు పెద్దల ఒత్తిళ్లు.. చట్టపరమైన చికులు మధ్యలో నలిగిపోతున్న బ్యూరోక్రాట్లు రాష్ట్రం నుంచి బయటపడేందుకు మార్గాలు వె తుకుతున్నట్టు సచివాలయ వర్గాల్లోనే ప్రచా రం జరుగుతున్నది. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు కొందరు, సొంత రాష్ట్రాలకు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు మరికొందరు, సెలవుపై వెళ్లేందుకు ఇంకొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
మరికొందరు ఏకంగా వీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. సీనియర్ ఐ ఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఈ ధోరణి రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కాం గ్రెస్ ప్రభుత్వం వరుసగా విచారణలు, కమిష న్లు వేస్తుండటం.. ఆయా వ్యవహారాల్లో అధికారుల పాత్రను కూడా పరిశీలిస్తుండటంతో ఇప్పుడు తాము తీసుకునే ప్రతి నిర్ణయం రేపు తమ మెడకే చుట్టుకుంటుందనే ఆందోళన అధికారుల్లో నెలకొన్నదని తెలిసింది. సంపూర్ణ ప్ర జాప్రయోజనాలతో కూడిన నిర్ణయాలపైనే వి చారణ పేరుతో ఇన్ని ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో ప్రభుత్వం మారి తే ముఖ్యనేత సోదరులు, షాడో సీఎంవో కుంభకోణాల నుంచి తప్పించుకోవటం అసంభ వమని బెంబేలెత్తిపోతున్నట్టు ప్ర చారం జరుగుతున్నది. దీంతో తెలంగాణలో పనిచేయడం కంటే మరోచో టకు వెళ్లిపోవడమే మే లని కొందరు బ్యూరోక్రాట్లు భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
విచారణలతో గుబులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు ఆరోపణలు ఎదురొంటున్న పలు కీలక వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణలు చేపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు, ఫార్ములా ఈ-రేసు, ఔటర్ రింగ్ రోడ్డు లీజు, ధరణి తదితర వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విచారణల పరిధిలోకి తీసుకొచ్చిందని, వందకు వంద శాతం ప్రజాప్రయోజనాలు ఉన్న ఆయా వ్యవహారాల్లో రాజకీయ నాయకుల పాత్రతోపాటు నిర్ణయాల అమల్లో భాగస్వాములైన అధికారుల వ్యవహారశైలిని కూడా పరిశీలిస్తున్నారని బ్యూరోక్రాట్లు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది.
తాజాగా బీఆర్ఎస్ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తులకు సంబంధించిన భూములపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం రాజకీయ కక్షతో వేసిన ఈ కమిటీలో తాను పనిచేయ లేనని, రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతారని, కానీ వాటిని అమలు చేసిన అధికారులు తర్వాత దొరికిపోతారనే అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఓ సీనియర్ ఏఐఎస్ అధికారి సెలవులపై వెళ్లినట్టు తెలిసింది. అవసరమైతే సెలవులు పొడిగించుకునే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది.
ఇప్పుడు కూడా అదే ఒత్తిళ్లు
ప్రస్తుత కాంగ్రెస్ సరార్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే తమ మారు దోపిడీకి తెరతీసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని, కోట్లాది రూపాయల భూముల వ్యవహారాల్లో అడ్డగోలు క్లియరెన్సులు ఇవ్వాలని, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో నిబంధనలు గాలికొదిలేయాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒక ఎత్తయితే, రాజ్యాంగేతర శక్తులుగా మారిన పాలకుల సోదరులు, బంధువులు.. సచివాలయంలో చక్రం తిప్పడం బ్యూరోక్రాట్లకు మింగుడుపడటం లేదని చెప్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తన హయాంలోనూ కొన్ని కీలక పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నదనే ప్రచారం సచివాలయ వర్గాల్లోనే జరుగుతున్నది.
కొన్ని పనులకు నిబంధనలు అడ్డుగా ఉన్నా అనుమతులు ఇవ్వాలని, కొన్ని సర్వేలు, ప్రతిపాదనలు నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ముందుకు తీసుకెళ్లాలని రాజకీయ పెద్దలు కోరుతున్నట్టు చెప్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల మీద ముఖ్యనేత సోదరులు పుంఖానుపుంఖాలుగా ఫైళ్లు తీసుకొస్తున్నారని, వారు కోరిన విధంగా పనులు చేయకపోతే, వాటిని క్లియర్ చేయకపోతే బూతు పురాణం అందుకుంటున్నారని సీనియర్ అధికారి ఒకరు తన ఆత్మీయుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యనేత స్థాయి నుంచే అధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి సోదరులు కూడా కొందరు అధికారులతో అమర్యాదగా వ్యవహరిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఒక గ్రూప్‌గా ఏర్పడి 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొడుతున్నారని, వారికి ఆ జిల్లా కలెక్టర్ అనివార్యంగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది.
ఏడాదిన్నర నెట్టుకొస్తే చాలు
ఈ నేపధ్యంలో బ్యూరోక్రాట్లు అప్రకటిత పెన్‌డౌన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిబంధనల ప్రకారమే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దలను నొప్పించకుండా.. కాలయాపనతోనే నెట్టుకురావడం ఉత్తమమనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఎలాగోలా ఒక ఏడాది, ఏడాదిన్నర కాలం నెట్టుకొస్తే రాజకీయ సమీకరణాలు మారుతాయని, ఆ తర్వాత పాలనాపరంగా కొంత స్వేచ్ఛ దొరుకుతుందని బ్యూరోక్రాట్లు లెకలేసుకుంటున్నట్టు చెప్తున్నారు. రాజకీయ నేతల ఆదేశాలను గుడ్డిగా పాటించి భవిష్యత్తును నాశనం చేసుకునేకంటే.. తప్పించుకు తిరగడమే మేలన్న భావన అధికారుల్లో స్థిరపడిపోయినట్టు చెప్తున్నారు.
ఏదైనా వివాదాస్పద నిర్ణయానికి సంబంధించిన ఫైల్ టేబుల్ మీదికి రాగానే, దానికి సంబంధించిన పాత జీ వోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కావాలని కొర్రీల చిట్టా విప్పుతున్నట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు భావించిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేయకుండా అభ్యంతరాలు చెప్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు కావాలని కోరడం, న్యాయశాఖ అభిప్రాయం తీసుకోవాలని రాయడం, సంబంధిత శాఖల నుంచి వివరణలు కోరడం వంటి పద్ధతులతో ఫైళ్లను పెండింగ్‌లో పెడుతున్నట్టు తెలిసింది. నేరుగా పనిని తిరసరించకుండా, నిబంధనల పేరుతో కాలయాపన చేయడమే రక్షణ కవచంగా మార్చుకుంటున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కేంద్ర సర్వీసుల వైపు చూపు
నిత్యం ఎదురయ్యే మానసిక క్షోభను భరించలేక చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్లు రాష్ట్రం విడిచి పారిపోవడానికి మార్గాలు వెతుకుంటున్నట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, స్వతంత్ర భారతంలో గానీ ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఏఐఎస్, ఐపీఎస్ అధికారులు ఫారెన్ సర్వీసుల కోసం దరఖాస్తులు చేసుకుని రాష్ట్రం దాటేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. మరికొందరు ఉన్నతాధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన పలువురు అధికారులు ఇతర రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాలకు ఇంటర్-క్యాడర్ డిప్యుటేషన్ల కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారని సచివాలయ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
ఈ వయసులో ఇలాంటి తిట్లు, రేపటి రోజున జైలుశిక్షల భయం తమకు వద్దనుకున్న మరికొందరు సీనియర్ అధికారులు ఏకంగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పాలకుల ఒత్తిళ్లను తట్టుకోలేకే ఢిల్లీకి వెళ్లిపోవడమే మేలని వీరు గట్టిగా భావిస్తున్నారు. వీరిలో ఒక సీనియర్ అధికారి తన పొరుగున ఉన్న సొంత రాష్ట్రానికి వెళ్లిపోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, పరిపాలనలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒక మహిళా అధికారి ఎలాగైనా సరే ఢిల్లీ సర్వీసులోకి వెళ్లేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు సమాచారం. మరోవైపు పాలక పెద్దల ఆగడాలు భరించలేక ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న పళంగా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోయినట్లు చెప్తున్నారు.
రేపు ప్రభుత్వం మారితే..
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని, ప్రస్తుత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు మృగ్యమని, రాబోయేది ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వమేనన్న విశ్లేషణలు అధికార వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులను వేధించినట్టే, రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేయిస్తున్న అవినీతి పనులపై విచారణలు ఖాయమని అధికారులకు స్పష్టంగా తెలుసని చెప్తున్నారు. రాజకీయ నేతలు ఎలాగోలా తప్పించుకుంటారని, లేదా పార్టీలు మారుతారని, కానీ తాము మాత్రం జీవితాంతం జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం వారిని తీవ్రంగా కలవరపెడుతున్నట్టు తెలిసింది. అధికారుల్లో ఈ ఆలోచనకు ప్రధాన కారణం భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలేనని ప్రచారం జరుగుతున్నది. అందుకే వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైళ్లను ముందుకు తీసుకెళ్లకూడదని కొందరు నిర్ణయించుకున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వీఆర్ ఎస్ బాటలో మరికొందరు..
ఎప్పుడు ఏ ఫైలుపై సంతకం పెట్టమని వేధిస్తారో, ఏ తిట్లు వినాల్సి వస్తుందోనన్న భయంతో కార్యాలయాలకు రావడానికే అధికారులు జంకుతున్నట్టు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఒక కలెక్టర్ తనను ఎలాంటి అదనపు బాధ్యతలు, బాదరబందీ లేని ప్రాంతానికి బదిలీ చేయాలని కోరినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయాలని ఆయన కోరినట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
కీలకమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారనే ప్రచారానికి ఈ వ్యవహారం మరింత ఆజ్యం పోస్తున్నది. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. అప్పట్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, అధికారులపై తప్పుడు పనులు చేయాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపించారు. తాజాగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ కూడా వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. 2027 సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్న ఆయన ముందుగానే వీఆర్ఎస్ తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రచారం బయటకు పొక్కిన మరుసటి రోజే ప్రభుత్వం ఆయనతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అయితే ఇప్పటివరకు తన వీఆర్ఎస్ విషయాన్ని జయేశ్ రంజన్ ఖండించకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

