వెంటనే నిర్మాణాలు ప్రారంభించండి
ఈ కార్తీక మాసంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని కులసంఘాలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.88.50 కోట్లను కేటాయించినట్టు వివరించారు. సమస్యల పరిష్కారం కోసమే జీవో14ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునేది లేదని వెల్లడించారు.
- నిర్మాణ పనుల కోసం రూ.88.50 కోట్లు
- సమస్యల పరిష్కారం కోసమే జీవో14
- భూములను వెనక్కి తీసుకునేది లేదు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- 38 కులసంఘాలకు జీవో పత్రాలు అందజేత
హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): ఈ కార్తీక మాసంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని కులసంఘాలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.88.50 కోట్లను కేటాయించినట్టు వివరించారు. సమస్యల పరిష్కారం కోసమే జీవో14ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇచ్చిన భూములను వెనక్కి తీసుకునేది లేదని వెల్లడించారు.
ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తాజాగా రాష్ట్రంలో 38 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధులతోపాటు, స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా జీవోలను జారీచేసింది. జీవో ప్రతులను ఆయా కుల సంఘాల ప్రతినిధులకు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కుల సంఘాలు జాప్యం చేయకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని, కార్తీక మాసంలోనే శంకుస్థాపనలు చేసుకోవాలని, ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని కోరారు. అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీవో14 ద్వారా కొత్త కార్యవర్గాల ఎంపికకు మార్గదర్శకాలు తీసుకొచ్చామని, కుల సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా ఉండి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.
అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా పరిసరాల్లో ఓయూకు సమీపంలో ఇప్పటికే ఉన్న స్థలాన్ని బీసీ అవసరాల కోసం వినియోగించుకోవాలని, అకడ గ్రంథాలయంతోపాటు రవీంద్రభారతి తరహాలో పెద్ద ఆడిటోరియం నిర్మిస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెటార్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయాదేవి, ఓబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల ముఖ్య నేతలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

