పాతాళానికి జలాలు
మేడ్చల్ జిల్లాలో ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.
- మేడ్లల్ జిల్లాలో 6.66 మీటర్ల లోతుకు
మేడ్చల్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ నెల చివరి వరకు 6.66 మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 15 మండలాల్లో భూగర్భజలాలు పడిపోయిన నేపథ్యంలో వర్షాకాలం వచ్చే వరకు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నర్థకరంగా మారింది.కాగా, లోటు వర్షపాతం నమోదు కారణంగా బోర్లు ఎండిపోతున్న క్రమంలో జిల్లాలోని వివిధ చెరువుల నుంచి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నీటి చౌర్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు విపరితమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో చెరువులలో ఉన్న నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు ట్యాంకర్ల యజమానులు సొమ్ము చేసుకుంటున్నరన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, అల్వాల్ 3.74 (మీటర్ల లోతుకు), బాచుపల్లి 0.40, బాలానగర్ 3.60, దుండిగల్ 9.82, ఘట్కేసర్ 5.00, కాప్రా 6.46, కీసర 5.02, కూకట్పల్లి 6.90, మూడుచింతలపల్లి 5.42, మల్కాజిగిరి 8.49, మేడ్చల్ 7.40, మేడిపల్లి 13.06, కుత్బుల్లాపూర్ 7.74, శామీర్పేట్ 4.51,ఉప్పల్ 8.40 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

