కేసీఆర్ కేటాయింపులకు కలరింగ్
మూడేండ్లుగా ఆత్మగౌరవ భవనాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి హడావుడి మొదలుపెట్టింది. బీసీల ఆత్మగౌరవ భవనాలకు కొత్తగా స్థలాలను కేటాయిస్తున్నట్టుగా ప్రచారం షురూ చేసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలాలు, నిధుల కేటాయింపులన్నీ జరిగాయి. వివిధ భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వాటికే కొత్తగా జీవోలను ఇచ్చింది తప్ప అదనంగా ఇచ్చిందేమీ లేదు.
- గతంలోనే స్థలాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం
- కాంగ్రెస్ వచ్చాకే నిలిచిన పనులు
హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా ఆత్మగౌరవ భవనాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి హడావుడి మొదలుపెట్టింది. బీసీల ఆత్మగౌరవ భవనాలకు కొత్తగా స్థలాలను కేటాయిస్తున్నట్టుగా ప్రచారం షురూ చేసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలాలు, నిధుల కేటాయింపులన్నీ జరిగాయి. వివిధ భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ వాటికే కొత్తగా జీవోలను ఇచ్చింది తప్ప అదనంగా ఇచ్చిందేమీ లేదు.
బీసీలు ఆత్మగౌరవాన్ని చాటుకొనేలా భవనాలు నిర్మించాలనే సదాశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2018లోనే 40 బీసీ కులాలకు రంగారెడ్డి జిల్లా కోకాపేట, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్భగయత్ తదితర చోట్ల మొత్తంగా 82.30ఎకరాల భూమిని కేటాయించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సైతం ప్రభుత్వ పరంగా రూ.95.25 కోట్లను కేటాయించారు. హెచ్ఎండీఏ రూ.10 కోట్లు ఖర్చుచేసి కులసంఘాల వారీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది.
36 భవనాల కోసం 2018లోనే జీవో
ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి మార్గదర్శకాలతోపాటు, 36 భవనాల నిర్మాణానికి 2018లో బీసీ సంక్షేమశాఖ జీవో20 ఉత్తర్వులు జారీచేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం 2019లో ఆత్మగౌరవ భవనాలకు చెందిన స్థలాలను కేటాయిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులకు అందజేశారు. ఆయా కులాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భవనాల నమూనాలను రూపొందించే బాధ్యతను సైతం తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కి అప్పగించింది. కార్పొరేషన్ సైతం 2020 నాటికి నమూనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అప్పగించింది.
అనంతరం 2022లో ప్రతి కులంలోని అన్ని సంఘాలనూ ఏకసంఘంగా ఏకతాటికి పైకి తీసుకొచ్చి ట్రస్ట్‌గా ఏర్పాటుచేసి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను అప్పగించింది. ట్రస్ట్‌లకు స్థలాలను సైతం అప్పగించింది. ప్రభుత్వమే భవనాలను నిర్మించి ఇవ్వాలని 16 కులాలు, సొంతంగా నిర్మించుకుంటామని మిగతా కులాలు తెలుపగా, ఆ మేరకు ప్రభుత్వం సై తం చర్యలు చేపట్టింది. భవనాల నిర్మాణా న్ని చేపట్టింది. ఆత్మగౌరవ భవనాలపై ఆయా కులాలకే అజమాయిషీని కల్పించింది. కుర్మ యాదవ భవన నిర్మాణం పూర్తయింది.
కాంగ్రెస్ వచ్చాక నిలిచిన పనులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 తర్వాత ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడమే తప్ప పైసా విదిల్చింది లేదు. తాజాగా జీవో14 ద్వారా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ట్రస్ట్‌లను తప్పించి ప్రభుత్వ అజమాయిషీ, మంత్రి నేతృత్వంలో నియమించే యాజమాన్య కమిటీకి ఆత్మగౌరవ భవనాల నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టింది. గతంలోని స్థలాలనే కేటాయిస్తూ మరోసారి కులాల వారీగా స్థలాలు, నిధులను కేటాయిస్తూ వేర్వేరుగా జీవోలను జారీ చేసింది. కొత్తగా నిధులను పెంచనే లేదు. ప్రభుత్వం తీరుపై బీసీ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కొత్తగా ఇచ్చిందేందని నిలదీస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

