హైదరాబాద్, మే 22 : అమెరికాలోని డాలస్లో గల తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్‘ స్ప్రింగ్ ఫెస్ట్-2026 వైభవంగా సాగింది. అమెరికా, భారత జాతీయ గీతాలాపానలతో కార్యక్రమం ప్రారంభం కాగా లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) ఆహుతులకు స్వాగతం పలికారు. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్స్కేప్లో జరిగిన ఈ వేడుకకు 2 వేల మందికి పైగా హాజరయ్యారు. వెండర్ బూత్లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాల్లో పిల్లలు, యువత సందడి చేశారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల వినోద కార్యక్రమాలతో చిన్నా, పెద్దా అంతా ఉర్రూతలూగారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది. ఫుడ్ స్టాల్స్, ఐస్క్రీమ్ షాపులు, పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా గడిపారు. యాంకర్ వీణ యలమంచిలి షోను రన్ చేశారు. అనంతరం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్-2026

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్-2026