సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్-2026
అమెరికాలోని డాలస్‌లో గల తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్‘ స్ప్రింగ్ ఫెస్ట్-2026 వైభవంగా సాగింది. అమెరికా, భారత జాతీయ గీతాలాపానలతో కార్యక్రమం ప్రారంభం కాగా లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) ఆహుతులకు..
హైదరాబాద్, మే 22 : అమెరికాలోని డాలస్‌లో గల తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్‘ స్ప్రింగ్ ఫెస్ట్-2026 వైభవంగా సాగింది. అమెరికా, భారత జాతీయ గీతాలాపానలతో కార్యక్రమం ప్రారంభం కాగా లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) ఆహుతులకు స్వాగతం పలికారు. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్స్కేప్లో జరిగిన ఈ వేడుకకు 2 వేల మందికి పైగా హాజరయ్యారు. వెండర్ బూత్‌లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాల్లో పిల్లలు, యువత సందడి చేశారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల వినోద కార్యక్రమాలతో చిన్నా, పెద్దా అంతా ఉర్రూతలూగారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది. ఫుడ్ స్టాల్స్, ఐస్‌క్రీమ్ షాపులు, పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద పిల్లలు ఉత్సాహంగా గడిపారు. యాంకర్ వీణ యలమంచిలి షోను రన్ చేశారు. అనంతరం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది.

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్-2026

సందడిగా టీపాడ్ స్ప్రింగ్ ఫెస్ట్-2026
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

