హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందాలు సోమవారం రానున్నాయి. ఎన్డీఎస్ఏ కమి టీ సిఫారసుల మేరకు ఆయా బరాజ్‌ల పనితీరు, లోపాలపై స్టడీ చేయనున్నాయి. ఎన్డీఎస్ఏ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటు, అన్నారం (పార్వతీ), సుందిళ్ల (సరస్వతీ) బరాజ్‌లో సీపేజీలపై ఆ రెండు సంస్థలతో సాంకేతిక అధ్యయనం చేయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ మేర కు నిధులు కేటాయించింది. ప్రధానంగా బ రాజ్‌లకు సంబంధించి ఎగువ, దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ పరిస్థితి, పారామెట్రిక్ జా యింట్లు, జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించి, ప్రస్తుతం కొనసాగుతున్న గ్రౌటింగ్ పనులను పరిశీలించనున్నాయి.